Balkampet: బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు.. ఇవాళ ఎదుర్కోలు ఉత్సవం

Arrangements for Balkampet Yellamma Utsavalu
x

Balkampet: బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు.. ఇవాళ ఎదుర్కోలు ఉత్సవం

Highlights

Balkampet: రేపు అమ్మవారి కల్యాణం, ఎల్లుండి రథోత్సవం

Balkampet: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్‌ 19న ఎదుర్కోలు ఉత్సవం, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం జరుగుతుంది. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం బల్కంపేట అమ్మవారి కల్యాణం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా బారికేట్లను ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి ప్రసాదం లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణానికి వచ్చారు. ఈ సారి కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సంవత్సరం అమ్మవారి కోసం ప్రతేకమైన చేనేత చీరలు నేయిస్తున్నారు. ఎదుర్కోలుకు, కళ్యాణానికి, రథోత్సవానికి అమ్మవారికి కట్టే చీరలను స్వయంగా గుడిలోనే నేయిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి బంగారు కవచం,, వడ్డాణం, పుక్కుపుడక, బాసింకం,కాసులపేరు బంగారు నకలన్నీ అలంకరిస్తున్నారు.

ప్రతి ఏటా కూడా భక్తులు భారీ ఎత్తున భక్తు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అందుకే వారికి ఏ ఇబ్బందీ కలగకుండా, ఈ సారి ఏడు బారికేట్లు ఏర్పాటు చేశారు. vip లకు టోకెన్ లు ఇవ్వట్లేదని అధికారులు చెబుతున్నారు. సామాన్యులకు అమ్మవారి దర్శనం ప్రశాంతం గా జరిగే విధంగా చూసుకుంటున్నామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories