logo

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు : కీలక ప్రకటన

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు : కీలక ప్రకటన
Highlights

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే నెల 11న సెలవు ప్రకటించారు అధికారులు. ఈ మేరకు...

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే నెల 11న సెలవు ప్రకటించారు అధికారులు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవును వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలున్న చోట ముందురోజు కూడా స్థానిక సెలవు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.


లైవ్ టీవి


Share it
Top