logo
తెలంగాణ

JC Diwakar Reddy: తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి

AP TDP Leader JC Diwakar Reddy Came to Telangana Assembly and meets KCR and  KTR
X

జేసీ దివాకర్ రెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసిన జేసీ * తెలంగాణ వదిలి చాలా నష్టపోయామన్న జేసీ * ఏపీని వదిలి తెలంగాణకు వస్తానన్న జేసీ

JC Diwakar Reddy: తెలంగాణ అసెంబ్లీకి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. అసెంబ్లీలో ఉన్న సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ వదిలి చాలా నష్టపోయామని జేసీ అన్నారు. తెలంగాణలో పాలన బాగుందని కితాబు ఇచ్చారు. హుజూరాబాద్ గురించి తనకు తెలియదన్నారు. జానా రెడ్డి ఎందుకు ఓడిపోయాడనేది అందరికీ తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఎక్కడ బాగలేవని జీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సమాజం కూడా బాగోలేదన్నారు. సీఎల్పీలో తన పాత మిత్రులను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని గుర్తు చేశారు. ఆంధ్ర వదిలి తెలంగాణకు వస్తానని అన్నారు.

కేసీఆర్‌ను సీఎం హోదాలో కలవలేదని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని జేసీ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. రాయలసీమ వాసులైన తమను కలుపుకుని పోకపోవడం తప్పు అని సీఎంకి చెప్పినట్టు తెలుస్తోంది. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయని దివాకర్‌కు సీఎం సమాధానం చెప్పారు.

Web TitleAP TDP Leader JC Diwakar Reddy Came to Telangana Assembly and meets KCR and KTR
Next Story