Andhra Pradesh: ఆన్‌లైన్ సినిమా టికెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం గైడ్‌లైన్స్ జారీ

AP Government Issues Guidelines on Online Movie Ticket Sales
x

ఆన్‌లైన్ సినిమా టికెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం గైడ్‌లైన్స్ జారీ

Highlights

Andhra Pradesh: నోడల్ ఏజెన్సీగా APFDCకి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలు

Andhra Pradesh: ఆన్‌న్లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా APFDC సర్వీస్ ప్రొవైడర్‌కు బాధ్యతల నిర్వహణ అప్పగించారు. ఇకపై రాష్టంలోని థియేటర్లు APFDCతో అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించింది. అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలని ఆదేశించింది.

విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలని తెలిపింది. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలని, కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మాకాలు జరపాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. అలాగే ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories