Chandrababu: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన సీఐడీ..

AP CID to Seize Chandrababu House
x

 Chandrababu: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన సీఐడీ..

Highlights

Chandrababu: విజయవాడ ఏసీబీ కోర్టులో దరఖాస్తు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం జప్తునకు సీఐడీ ఏసీబీ కోర్టును అనుమతి కోరింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తు చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. సీఐడీ దరఖాస్తుపై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ ప్రణాళికలతో లింగమనేని రమేష్‌ ఆస్తుల విలువ పెరిగేలా చంద్రబాబు దోహదపడ్డారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతి ఇవ్వగా సీఐడీ ఏసీబీ అనుమతి కోసం దరఖాస్తు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories