మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...

Another Shock to the Congress Party
x

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...

Highlights

Munugode: టీఆర్ఎస్‎లో చేరిన కాంగ్రెస్ సర్పంచ్‎లు, ఎంపీటీసీలు

Munugode: మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. తాజాగా ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి, నిజామాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్‌‎రెడ్డి సమక్షంలో కారెక్కారు. ఈసందర్భంగా వారిని మధుసూదనాచారి, జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ పనితీరును ప్రజలు, ప్రతిపక్ష నేతలు కూడా గమనిస్తున్నారు కాబట్టే పార్టీలో చేరుతున్నారన్నారు.

ఇక మునుగోడులో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో రాష్ట్ర సర్పంచుల ఫోరమ్‌ అధ్యక్షుడు, రావి గూడెం సర్పంచ్‌ గుర్రం సత్యంతో పాటు మరికొందరు సర్పంచ్‎లు, ఎంపీటీసీలు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories