Adilabad: అడవుల్లో బయటపడ్డ పురాతన ఆలయం

Ancient Temple Spotted in Adilabad Forest
x

పురాతన దేవాలయం ఆదిలాబాద్ (ఫైల్ ఫోటో)

Highlights

Adilabad: జైనథ్‌ మండలం గిమ్మా శివారులో ఆలయం గుర్తింపు * వెయ్యి ఏళ్ల క్రితం నాటి ఆలయంగా చెబుతున్న చరిత్రకారులు

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో పురాతన ఆలయం బయటపడింది. జైనథ్‌ మండలం గిమ్మా గ్రామ శివారులో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆలయం వేయేళ్ల క్రితం నాటి ఆలయమని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఈ ఆలయాన్ని రాక్షసరాజులు నిర్మించినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో నాగదేవత, గణపతి దేవుడుతోపాటు పలు రాతి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆలయ ముఖద్వారం తూర్పువైపు కాకుండా పడమరవైపు నిర్మాణం చేపట్టడంతోనే ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆపేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories