Shabbir Ali: కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆసక్తికర నిర్ణయం..

An interesting Decision by Senior Congress Leader Shabbir Ali
x

Shabbir Ali: కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆసక్తికర నిర్ణయం

Highlights

Shabbir Ali: కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్న షబ్బీర్ అలీ

Shabbir Ali: కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ విముఖత చూపుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థిగా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ బరిలో ఉండటంతో.. షబ్బీర్ అలీ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు భిన్నంగా వస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

అయితే కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలనుకుంటున్నారట. ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్న మదన్ మోహన్ రావును.. కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కాంగ్రెస్‌ హైకమాండ్ కోరుతోంది. షబ్బీర్ అలీ నిర్ణయంపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories