Bandi Sanjay: తెలంగాణ గవర్నర్‌ను బీఆర్ఎస్ పార్టీ దారుణంగా అవమానించింది

Amit Shah Will Visit Karimnagar On 28th Of This Month Says Bandi Sanjay
x

Bandi Sanjay: కరీంనగర్‌లో ఈనెల 28న అమిత్ షా పర్యటిస్తారు

Highlights

Bandi Sanjay: గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం నడిపింది

Bandi Sanjay: కరీంనగర్ లో ఈనెల 28న అమిత్ షా పర్యటించనున్నారని, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాట్లు పర్యవేక్షించారాయన.. కరీంనగర్‌లో సుమారు 30 వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఫిబ్రవరి 5 వ తేదీ నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తాను పాదయాత్ర చేయనున్నానని తెలిపారు.

గ్రామీణస్థాయిలో ప్రలజ అవసరాలను గుర్తించేందుకు స్థానికులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిందని బండి సంజయ్ విమర్శించారు. గవర్నర్‌ను బీఆర్ఎస్ పార్టీ దారుణంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories