Amit Shah: ఎల్లుండి తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్‌ షా

Amit Shah Will Visit In Telangana
x

Amit Shah: ఎల్లుండి తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్‌ షా

Highlights

Amit Shah: మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు షా

Amit Shah: పార్లమెంట్‌ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణలో పర్యటించనున్నారు బీజేపీ అగ్రనేత అమిత్‌షా. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ బయలేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాల నుంచి 2 గంటల 40 నిమిషాల వరకు మహబూబ్‌నగర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తారు.

అక్కడ బీజేపీ నిర్వహించే సమావేశంలో సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుంచి ఐదు గంటల వరకు పాల్గొంటారు. అనంతరం కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. తర్వాత హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగే మహిళా సమ్మేళనానికి హాజరవుతారు. అనంతరం 7 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories