Amit Shah: రేపు తెలంగాణలో అమిత్‌ షా పర్యటన

Amit Shah visit to Telangana Tomorrow
x

Amit Shah: రేపు తెలంగాణలో అమిత్‌ షా పర్యటన

Highlights

Amit Shah: భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్న అమిత్‌ షా

Amit Shah: గతంలో రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఖమ్మం జిల్లా పర్యటన.. ఎట్టకేలకు ఖరారయ్యింది. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ జీఎస్ఆర్ కళాశాల మైదానంలో రేపు జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సభ నిర్వహణతో పాటు బారికేడ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్ష మంది వరకు తరలించేలా పార్టీ వర్గాలు కార్యాచరణ రూపొందించాయి. సభకు ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ ముఖ్య నేతలంతా ఖమ్మంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories