Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై కమలం ఫోకస్‌.. రేపు తెలంగాణకు అమిత్ షా

Amit Shah To Telangana Tomorrow
x

Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై కమలం ఫోకస్‌..రేపు తెలంగాణకు అమిత్ షా

Highlights

Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న షా

Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్‌ పెంచింది. ఇప్పటికే లోక్‌సభ ఎలక్షన్‌పై ఆ పార్టీ రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తుండగా.. రేపు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు శంషాబాద్ రానున్నారు షా. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవాటెల్‌కు వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు షా. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి అనంతరం కొంగరకలాన్‌ వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుంచి ప్రారంభం కానున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని.. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా. అనంతరం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ బయలుదేరతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories