బీజేపీ ఆధ్వర్యంలో అట్టహాసంగా విమోచన వేడుకలు

Amit Shah to Secunderabad Parade Ground
x

బీజేపీ ఆధ్వర్యంలో అట్టహాసంగా విమోచన వేడుకలు

Highlights

Amit Shah: కాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌కు అమిత్‌షా

Amit Shah: బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విమోచన వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాసేపట్లో కాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌కు అమిత్‌షా చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట్‌ టూరిజం హోటల్లో ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం.. సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో అమిత్‌షా పాల్గొంటారు. దివ్యాంగులకు ఆయన పరికరాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత పోలీస్‌ అకాడమీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక.. సాయంత్రం ఈటల రాజేందర్‌ ఇంటికి అమిత్‌ షా వెళ్లనున్నారు. ఇటీవల ఈటల తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈటలను అమిత్‌ షా పరామర్శించనున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి అమిత్‌ షా తిరుగుపయనం అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories