Amit Shah: తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తాం

Amit Shah Speech At Suryapet Public Meeting
x

Amit Shah: తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తాం

Highlights

Amit Shah: బీసీల హక్కులు కాపాడే ఏకైక పార్టీ బీజేపీ

Amit Shah: సూర్యాపేట జనగర్జన సభలో అమిత్ షా హాట్ కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో బీజేపీని గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్‌ పేదల వ్యతిరేక పార్టీ అన్న అమిత్ షా.. బీసీల సంక్షేమానికి ఏడాదికి 10వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ చట్టబద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని.. బీసీల హక్కులు కాపాడే ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీసీల ప్రాధాన్యతపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. టికెట్ల కేటాయింపుల్లో ప్రియారిటీ పెంచుతూ బీసీ వర్గం నేతలను, ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టికెట్ల కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసింది. తమ పార్టీ మాత్రమే బీసీల హక్కులు కాపాడుతుందని.. తెలంగాణలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బీసీనే చేస్తామని ప్రకటించారు. బీసీ వర్గం నుంచి కూడా అధికారం మాకెప్పుడంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ అమిత్ షా కామెంట్‌... అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్ఎస్‌లను కార్నర్ చేసింద.

Show Full Article
Print Article
Next Story
More Stories