CM KCR: అల్లూరి అమరత్వం అజరామరం

Alluri Sitaramaraju 125th Birth Anniversary Celebrations At Gachibowli Indoor Stadium Today
x

CM KCR: అల్లూరి అమరత్వం అజరామరం

Highlights

CM KCR: దేశ స్వాతంత్య్రం, స్వయం పాలన కోసం అల్లూరి చేసిన త్యాగం గొప్పది

CM KCR: అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని సీఎం కేసిఆర్ అన్నారు .స్వాతంత్య్రోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని పేర్కొన్నారు.

గిరిజనుల హకుల సాధన కోసం నాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. సీతారామరాజు వంటి వీరుల స్ఫూర్తితో ఎందరో దేశ పౌరులు నాటి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. అల్లూరి త్యాగాలను స్మరించుకొంటూ రేపటి తరాలు ముందుకు సాగాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories