Narayanpet: పదో తరగతి పరీక్షల కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు

Narayanpet: పదో తరగతి పరీక్షల కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు
x
DEO Office
Highlights

జిల్లాలో ఈనెల 19 వ తేదీ నుండి జరగనున్న పది పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, జిల్లా విద్యాశాఖ అధికారులు పలు చర్యలు తీసుకున్నారు.

నారాయణపేట: జిల్లాలో ఈనెల 19 వ తేదీ నుండి జరగనున్న పది పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, జిల్లా విద్యాశాఖ అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని మొత్తం 11 మండలలో 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలో మౌలిక వసతులు కల్పిస్తూ అలాగే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. 37 పరీక్ష కేంద్రాల పరిధిలో 3366 న మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 34 రెగ్యులర్, మూడు ప్రయివేటు పరీక్ష కేంద్రాలను సైతం ఏర్పాటుచేశారు. మరియు వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల దగ్గర మంచినీటి వసతితో పాటు, వైద్య సిబ్బందిని సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ వెల్లడించారు.

ఇందులో భాగంగా పరీక్షల సమాచారాన్నిఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతీక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా బుధవారం నారాయణపేట జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పై పోలీసుశాఖ ప్రత్యేకంగా యాంటీనాను బిగించారు. ఈ యొక్క యాంటిన ద్వారా జిల్లాలోనిఅన్ని పరీక్ష కేంద్రాల నుండి సమాచారాన్ని సేకరించి వెను వెంటనే ఉన్నత అధికారులకు చేరవేయనున్నారు.

కంట్రోల్ రూం కేంద్రం పనితీరు విధానాన్ని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ పరిశీలించారు. పది పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, జిల్లాలో 498 మంది ఇన్విలెటర్లను నియమించారు.ఈ మేరకు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వారితో పాటు కార్యాలయ అధికారి సైతం ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. నారాయణపేట నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పది పరీక్షలు ఏర్పడుతున్న నేపథ్యంలో, మంచి ఫలితాలు సాధిoచేందుకు విద్యాశాఖ అధికారులు పలు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories