లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులిచ్చే అవకాశం.. మూడో విడత ఉచిత రేషన్, నగదు పంపిణీపై..

లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులిచ్చే అవకాశం.. మూడో విడత ఉచిత రేషన్, నగదు పంపిణీపై..
x
Highlights

లాక్‌డౌన్‌, వానాకాలం వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకల వంటి అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2...

లాక్‌డౌన్‌, వానాకాలం వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకల వంటి అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశంలో ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించే అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌పై చర్చిస్తారు. ఇప్పటికే చాలావరకు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం మరిన్ని అంశాల్లో కూడా వెసులుబాటు కల్పిస్తారని తెలుస్తోంది. ఇటు కరోనా నియంత్రణా చర్యలపై కూడా చర్చించడంతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో రోజు విడిచి రోజు దుకాణాలు తెరుస్తున్నారు. అయితే ఈ పద్దతిని మరికొంత కాలం కొనసాగిస్తారా..? లేక మార్పులేమైనా చేయాలన్నదానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

అలాగే తెల్లరేషన్‌ కార్డుదారులకు మూడో విడత ఉచిత రేషన్ బియ్యం, 15 వందల నగదు పంపిణీపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటారు. ఏప్రిల్, మే నెలల్లో ఇచ్చినట్లుగానే జూన్‌లో కూడా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక జూన్‌ 2 న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించే విషయంపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే నియంత్రిత సాగుపై రైతుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై కూడా చర్చిస్తారు. ఎరువులు, విత్తనాలు లభ్యతపై అధికారులకు ఆదేశాలివ్వనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories