పదోతరగతి పరీక్షల రద్దుపై సర్వత్రా హర్షం!

పదోతరగతి పరీక్షల రద్దుపై సర్వత్రా హర్షం!
x
Highlights

కరోనా వైరస్ విద్యాసంవత్సరాన్ని కకావికలం చేసింది. అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కరోనా దెబ్బకు కుదేలయ్యారు.

కరోనా వైరస్ విద్యాసంవత్సరాన్ని కకావికలం చేసింది. అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కరోనా దెబ్బకు కుదేలయ్యారు.పరీక్షల సమయంలో కేంద్రం లాక్‌డౌన్‌ చేపట్టడంతో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఆగిపోయాయి. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నిర్వహణ చేపట్టాలనుకున్నా సిట్చువేషన్ అనుకూలించక గ్రేడింగ్ విధానం ద్వారా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో విద్యార్థుల భవితవ్యం ఎలా ఉండబోతుంది.

కరోనా రక్కసికి ఈ ఏడాది విద్యాసంవత్సరం కుదేలు అయ్యింది. విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కాంపిటేటివ్ పరీక్షల్లో, ఉన్నత విద్యకు సీట్ల విషయంలో వచ్చే ఎడబాటును ఎదుర్కొనే విధంగా గ్రేడింగ్ విధానం చేపట్టాలని, శాస్త్రీయ పద్దతిలో ఈ విధానం అమలు చేసి గ్రామీణ, పట్టణ, మెరిట్ విద్యార్థులలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు ప్రభుత్వానికి సలహాలు అందిస్తున్నారు.

కోవిడ్ 19 విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదే. విద్యార్థులు, తల్లిదండ్రులు మానసికంగా కొంత ఆందోళనాలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించడం బాగుంది. ఇప్పటి వరకు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉన్న ఇంటర్నల్ మర్క్స్ విధానాన్ని శాస్త్రీయ పద్దతిలో జరిపరా లేదా అని లోతుగా అధ్యయనం చెయ్యాలి. రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్దులకు న్యాయం చేయాలని కోణంలో ఏమైనా తప్పులు దొర్లే అవకాశం ఉంది. అలాంటివాటికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్దులకు రానున్న రోజుల్లో ఐఐటి బాసర లాంటి విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించడానికి గ్రేడింగ్ లో ఉన్న మార్కుల జాబితా అత్యంత కీలకంగా మారనుంది. ఈ తరుణంలో ప్రభుత్వం విద్యార్దులకు ఎలాంటి సమన్యాయం చేస్తుందో అని వేచి చూస్తున్నారని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

కఠిన నిర్ణయం అయిన సరైన సమయంలో ప్రభుత్వ తీసుకోవడం స్వాగతిస్తున్నాం. ఇంటర్నల్ మర్క్స్ తో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. టపర్స్ కి ఎలాంటి నష్టం లేదు. గ్రేడింగ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్దులకు చాలా అవకాశం. డ్రాప్ ఔట్ తగ్గించడానికి ఉపోయాగపడుతుంది. ఆరోగ్యం ముఖ్యం. వచ్చే తరాన్ని కపడుకోవలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం అని పాఠశాల యాజమాన్యాలు అంటున్నారు.

కరోనా విపత్కర పరిస్థితిలో ఎక్కువ నష్టపోయింది విద్యారంగం. పరిస్థితులు చక్కబడితే పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇవ్వాలని ప్రభుత్వం భవించిన సాధ్య పడలేదు. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. పదవ తరగతి ని ప్రధాన ఘట్టంగా చూస్తున్నా తరుణంలో. ఇలాంటి మెట్టును అప్ గ్రేడ్ చెయ్యడం ద్వారా రాబోయే రోజుల్లో ఉన్నత విద్యావకాశాలకు ఇది సమస్య కాకుండా ఉండాలి. కరోనా బ్యాచ్ అనగానే ఫ్రీ గా పాసయ్యారు అనే భావన లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఐఐటిలో విషయంలో వచ్చే ఇబ్బందులను అంచనా వెయ్యాలి. సంస్కరణలు తెచ్చిన ప్రభుత్వ పెద్దలు ఆలోచన చెయ్యాలి. 1969లో పరీక్షలు లేకుండా పాస్ చేశారు. అలంటి అనుభవం ఉంది. కాబట్టి మంచి నిర్ణయాన్ని అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కరోనా హాలిడేస్ లో ఎప్పుడు పరీక్షలు అనే ఆలోచన ఉండే. పరీక్షల తేదీలు ఇచ్చాక హైకోర్టు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రద్దు వైపు ప్రభుత్వం ఆలోచన విద్యార్దులకు, తల్లిదండ్రులకు సంతోషాదయకం. గ్రేడింగ్ శాస్త్రీయ పద్దతిలో చేయాలి. గతంలో జరిగిన అవకతవకలు లేకుండా ప్రమోట్ చెయ్యాలి. విద్యార్థులను మొదట అయోమయానికి గురిచేసిన చివరికి మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో రద్దుకు మొగ్గు చూపడం సరైన నిర్ణయం.

రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు పై తీసుకున్న గ్రేడింగ్ విధానంతో అప్ గ్రేడ్ అవడం స్వాగతిస్తున్న . రానున్న రోజుల్లో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories