
తెలంగాణలో మధ్యం ధరలు భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మధ్యం ధరలు భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల లిక్కర్ ధరలను 10 శాతం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. పెరిగిన ధరలకు పట్టికను ఆబ్కారీ శాఖ అధిరారి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
లైట్ బీరుపై 100 రూపాయలు వసూలు చేస్తుండగా, దీనిపై రూ.110 వసూలు చేయనున్నారు. స్ట్రాంగ్ బీర్లపై రూ.12 నుంచి ఇక 20 రూపాయిలు పెంచనున్నారు. ఇతర రకాల బ్రాండ్‌ను బట్టి రూ.80 నుంచి రూ.100 పెరగనున్నాయి. కాగా, ఓల్డ్ స్టాక్ మద్యానికి పెంచిన ధరలు పెంచిన ధరలు వర్తించవని ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కొత్తగా పెంచనున్న మద్యం ధరలతో తెలంగాణ సర్కార్‌కు రూ.300 కోట్ల పైగా అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆంధ్రపద్రేశ్‌లో మద్యం విక్రయాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ధరలు పెంచడంతో మందు బాబులకు చుక్కలు కనిపించనున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. 2017 తర్వాత రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడం ఇది రెండో సారి ఈ సారి ప్రభుత్వం గరిష్టంగా 10 శాతం ధరలు పెంచడంతో మందుబాబులు అవాక్కవుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




