logo
తెలంగాణ

Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు

Alai Balai in the Nampally Exhibition Ground
X

Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు

Highlights

Alai Balai: బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో కార్యక్రమం

Alai Balai: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్ బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా దసరా మరుసటి రోజు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. ‍‍హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ వేదికగా అలాయ్ బలాయ్ వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకకు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్‌ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతోంది. 17 ఏడేళ్లుగా బీజేపీ నేత దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతుంది. దసరా తరువాత రోజు జరుగుతున్న ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి వచ్చే అతిధులకు తెలంగాణ వంటకాలు వడ్డించనున్నారు. మటన్, చికెన్, పాయా, హలీం లాంటి నాన్ వెజ్ వంటలతోపాటు... వివిధ రకాల పిండి వంటలు కూడా సిద్దం చేశారు.

Web TitleAlai Balai in the Nampally Exhibition Ground
Next Story