ఆ రెండు రాష్ట్రంలో అమలు చేయవద్దంటూ సీఎం కేసీఆర్‌ను కోరాం: ఎంపీ అసదుద్దీన్‌

ఆ రెండు రాష్ట్రంలో అమలు చేయవద్దంటూ సీఎం కేసీఆర్‌ను కోరాం: ఎంపీ అసదుద్దీన్‌
x
అసదుద్దీన్‌
Highlights

యునైటెడ్ ముస్లిం యాక్షన్ ఫోరం బృందంతో కలిసి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న...

యునైటెడ్ ముస్లిం యాక్షన్ ఫోరం బృందంతో కలిసి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న సీఏఏ, ఎన్నార్సీని అమలు చేయవద్దంటూ సీఎం కేసీఆర్ కు లేఖ సమర్పించారు. సుమారు మూడు గంటల పాటు సీఎంతో చర్చించారు. తమ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

మత ప్రాతిపదికనే ప్రధాని మోదీ ఎన్నార్సీ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎన్‌పీఎ, ఎన్‌ఆర్సీకి తేడా లేదన్నారు. దేశ వ్యాప్తంగా కలిసి వచ్చే భావసారూప్యత గల పార్టీలతో కలిసి ముందుకెళతామన్నారు. ఈనెల 27న నిజామాబాద్ లో సభ నిర్వహించనున్నట్లు అసదుద్దీన్ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను సభకు ఆహ్వనించనున్నట్లు తెలిపారు. జనభా లెక్కలకు NPA లెక్కలకు తేడా ఉందని జనాభా లెక్కల్లో పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రుల వివరాలు అడగరని NPAలో పౌరసత్వ వివరాలు అడుగుతున్నారని ఒవైసీ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories