Adilabad: రెండేళ్ల పాపకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది

Adilabad Government Hospital Staff Gave Expired Medicine to 2 Years Child | Telugu Online News
x

Adilabad: రెండేళ్ల పాపకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది

Highlights

Adilabad: *జ్వరం తగ్గకపోవడంతో పాటు తీవ్ర విరేచనాలు *గడువు తీరిన మందులు ఇచ్చినట్లు గుర్తింపు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు కలకలం రేపాయి. రెండున్నరేళ్ల పాపకు జ్వరం రావడంతో గత శనివారం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అక్కడున్న వైద్య సిబ్బంది పాప జ్వరానికి సంబంధించిన సిరప్ తో పాటు జలుబు, దగ్గుకు సంబంధించిన మెడిసిన్‌లు ఇచ్చి పంపించారు. అయితే మందులు వాడినా పాపకు జ్వరం తగ్గకపోగ మరింత పెరగడంతో మరునాడు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అయితే నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన సిరప్‌లపై అనుమానం రావడంతో పరిశీలించిన తల్లితండ్రులు కాలం చెల్లిన మందులుగా గుర్తించారు. సెప్టెంబర్ నెలతో కాలం చెల్లిన సిరప్ లు ఉండండతో ఆందోళనకు గురయ్యారు పాప పేరెంట్స్. కాలం చెల్లిన మెడిసిన్స్ ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories