Yadadri: యాదాద్రిలో ప్రారంభమైన ఆర్జిత సేవలు

Acquired services started in Yadadri
x

Yadadri:(File Image)

Highlights

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి.

Yadadri: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి.ఈ విషయాన్ని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. గత నెల 25న ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. అయితే దేవస్థానంలో కరోనా ప్రభావం తగ్గడంతో మళ్లీ ఆర్జిత సేవలను ప్రారంభించారు. ఇందులో భాగంగా నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, అభిషేకం, అర్చనలు, అష్టోత్తరం, అలంకారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా, భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆలయం ఈవో గీత వెల్లడించారు.

ఆర్జితసేవలతోపాటు నిత్యాన్నప్రసాద సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. యాదాద్రి అనుబంధ ఆలయాల్లో కూడా మొక్కు పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవల్లో పాల్గొనేలా, కల్యాణ మండపం హల్‎లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories