TSPSC Paper Leakage Case: తన భర్త రాజశేఖర్‌పై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని పిటిషన్‌

Accused Rajsekhar Wife To High Court In TSPSC Paper Leakage Case
x

TSPSC Paper Leakage Case: తన భర్త రాజశేఖర్‌పై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని పిటిషన్‌

Highlights

TSPSC Paper Leakage Case: ఏమైనా అభ్యంతరాలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని సూచన

TSPSC Paper Leakage Case: TSPSC పేపర్ లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ భార్య పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది. తన భర్త రాజశేఖర్‌పై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని, వైద్య పరీక్షలు జరిపించాలంటూ రాజశేఖర్‌ భార్య.. కోర్టును కోరింది. దీనిపై స్పందించిన సిట్‌ తరపు న్యాయవాది సంతోష్‌.. జైలు నుంచి కస్టడీలోకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని, కస్టడీ ముగిశాక కోర్టులో హాజరుపర్చేముందు.. మరోసారి వైద్య పరీక్షలు చేయిస్తామని హైకోర్టుకు తెలిపారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే విచారణ జరుగుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్‌ తరపు న్యాయవాది సంతోష్‌ వాదనలు విన్న హైకోర్టు.. రాజశేఖర్‌ భార్య పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అవసరం లేదని తెలిపింది. ఏమైనా అభ్యంతరాలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని సూచించింది. మరోవైపు.. పేపర్‌ లీక్‌ ఘటనపై మూడోరోజు నిందితుల విచారణ కొనసాగుతోంది. 9 మంది నిందితులను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories