ఫామ్‌హౌస్‌ కేసులో A1 నిందితుడు రామచంద్ర భారతి విడుదల

Accused A1 Ramachandra Bharti Released In Farmhouse Case
x

ఫామ్‌హౌస్‌ కేసులో A1 నిందితుడు రామచంద్ర భారతి విడుదల

Highlights

* 45 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అరెస్ట్

Ramachandra Bharati: ఫాంహౌజ్ కేసులో A1 నిందితుడు రామచంద్ర భారతి జైలు నుంచి విడుదలయ్యాడు. 45 రోజుల తర్వాత జైలు నుండి రామచంద్రభారతి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన వెంటనే..మరో కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు బంజరాహిల్స్ పోలీసులు. అయితే కోర్టు ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి ఇవాళ విడుదలయ్యారు. రామచంద్ర భారతిపై ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు మరో రెండు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఇదే కేసులో A3గా ఉన్న సింహయాజులు ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక A2గా ఉన్న నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories