Top
logo

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..ఈ సారి రియల్టర్ల ఇళ్లలో

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..ఈ సారి రియల్టర్ల ఇళ్లలో
X
Highlights

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని కొంత మంది అధికారుల ఇండ్లలో అలాగే వ్యాపరవేత్తల ఇండ్లలో ఏసీబీ సోదాలు...

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని కొంత మంది అధికారుల ఇండ్లలో అలాగే వ్యాపరవేత్తల ఇండ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం మెదక్‌ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రియల్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మెదక్‌ మాజీ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ 112 ఎకరాల భూమికి ఎన్‌ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం తీసుకున్న కేసు దర్యాప్తులో భాగంగా తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట మండలం పులిమామిడిలలో ఈ తనిఖీలు ఏకకాలంలో చేసారు. అయితే వెల్దుర్తి మండలం మాసాయిపేటకు చెందిన ఏర్పుల శివరాజ్‌ తూప్రాన్‌లో శ్రీనివాస ప్లానర్స్, బిల్డర్స్, కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అయితే మాసాయిపేటలో 10 మంది దళితులకు కేటాయించిన 2.20 ఎకరాల ఇనాం భూమిని, ఎకరాకు రూ.50 వేల చొప్పున గతేడాది కొనుగోలు చేశాడు. దీనికి సంబందించిన నగేశ్‌ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో దీనికి సంబంధించిన పత్రాలు లభించాయి.

దీంతో శివరాజ్‌ కార్యాలయం, ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇనాం ములకు సంబంధించిన రైతులను, సర్వేయర్‌ నర్సింహులును విడివిడిగా విచారించారు. తూప్రాన్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, మీనాక్షీ కిరాణం, సూపర్‌ మార్కెట్‌ యాజమాని నాగిళ్ల ప్రభాకర్‌ గుప్త ఇంట్లో చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఏడు ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో సోదాలు నిర్వహించారు. ప్రభాకర్ ‌గుప్త ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అయితే ప్రభాకర్‌ భాగస్వాములు చీర్న రాజేశ్వర్‌ గుప్త, మురళి తదితరులను కూడా విచారించారు.

Web TitleACB Rides In two realtors office and house medak Telangana
Next Story