కామారెడ్డి జిల్లా పోలీసులపై కొనసాగుతోన్న ఏసీబీ విచారణ

కామారెడ్డి జిల్లా పోలీసులపై కొనసాగుతోన్న ఏసీబీ విచారణ
x
Highlights

కామారెడ్డి జిల్లా పోలీసులపై ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. క్రికెట్ బెట్టింగ్‌ కేసులో సి.ఐ. జగదీష్, ఎస్.ఐ. గోవింద్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. డి.ఎస్.పి. లక్ష్మీ నారాయణ పై.. ఆదాయానికి మించిన ఆస్తుల విచారణతో పాటు.. బుల్లెట్లు కేసు మెడకు చుట్టుకుంటుంది

కామారెడ్డి జిల్లా పోలీసులపై ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. క్రికెట్ బెట్టింగ్‌ కేసులో సి.ఐ. జగదీష్, ఎస్.ఐ. గోవింద్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. డి.ఎస్.పి. లక్ష్మీ నారాయణ పై.. ఆదాయానికి మించిన ఆస్తుల విచారణతో పాటు.. బుల్లెట్లు కేసు మెడకు చుట్టుకుంటుంది. హైదరాబాద్‌లోని డి.ఎస్.పి. నివాసంలో సోదాలు నిర్వహించిన సమయం లో.. పలు డాక్యుమెంట్లతో పాటు బుల్లెట్లు దొరికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ పై కేసు నమోదు అయినట్లు తెలిసింది.

క్రికెట్ బెట్టింగ్ కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణకు సంబంధం లేదని తేల్చిన ఏసీబీ అధికారులు లెక్కకు మించిన ఆస్తులకు కేసులో విచారణ ప్రారంభించారు. డిఎస్పి లక్ష్మీనారాయణ ఇంట్లో దొరికిన తుపాకీ తూటాలు ఎక్కడివి అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఏసీబీ అధికారులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు నమోదు అయింది.

నక్సలైట్ల కార్యకలాపాలు సీరియస్‌గా కొనసాగిన కాలంలో సహజంగా పోలీస్ అధికారుల దగ్గర ఆయుధాలు, తూటాలు ఉండేవి. ప్రస్తుతం అలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో ఆ తూటాలు ఎక్కడి నుంచి వచ్చాయని అధికారులు ఆరా తీస్తున్నారు. వెంటనే సమీపంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో డిఎస్పీ లక్ష్మినారాయణ పై అక్కడ కేసు నమోదు అయినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories