నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ పూర్తి

నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్‌పై  విచారణ పూర్తి
x
Highlights

-నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ పూర్తి -సూపరింటెండెంట్‌తో పాటు రవికుమార్‌ను విచారించిన కమిటీ -డీఎంఈ రమేష్‌ రెడ్డికి నివేదిక సమర్పించనున్న కమిటీ సభ్యులు

నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ పూర్తయ్యింది. బోర్డు రూమ్‌లో సూపరింటెండెంట్‌తో పాటు రవికుమార్‌ను కమిటీ సభ్యులు విచారించారు. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం నివేదికను డీఎంఈ రమేష్‌ రెడ్డికి కమిటీ సభ్యులు సమర్పించనున్నారు.

నిలోఫర్‌ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులపై జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై వైద్యాధికారులు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నిలోఫర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ రవికుమార్‌‌ వివరణ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories