లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగులు

Sub-Treasury Officer
x
Sub-Treasury Officer
Highlights

శ్రీరాముల నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆయనో ప్రభుత్వోద్యోగి... అయినా పెన్షన్‌ డబ్బుల కోసం కాళ్ళరిగేలా తిరిగారు. మలిదశలో అండగా నిలిచే డబ్బుల కోసం నానా పాట్లు పడ్డారు. అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఇదిగో అదిగో అంటూ తిప్పించుకుంటూ టైంపాస్‌ చేశారు. లంచం ఇస్తేనే ఫైలు కదులుతుందని తెగేసి చెప్పారు. దీంతో విసుగు చెందిన వ్యక్తి చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఉద్యోగుల అవినీతి బాగోతం బయటపడింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వర్థన్నపేటకు చెందిన శ్రీరాములు... ఈవోపీఆర్డీగా పనిచేసి ఇటీవలే రిటైర్డ్‌ అయ్యారు. దీంతో తనకు రావాల్సిన 28 లక్షల రూపాయల పెన్షన్‌ డబ్బుల కోసం గత నెలరోజులుగా సబ్ ట్రెజరీ కార్యాలయం చుట్టు తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. పైగా 20 వేలు లంచం ఇస్తేనే పెన్షన్‌ డబ్బుల మంజూరు ఫైల్‌ ముందుకు కదులుతుందని చెప్పడంతో కంగారుపడ్డ శ్రీరాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్టీవో కార్యాలయంలో శ్రీరాముల నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రిటైర్డ్‌ అయిన ఈవోపీఆర్డీ పెన్షన్‌ మంజూరు కోసం 15 వేలు లంచం తీసుకుంటూ ఎస్టీవో విక్రంకుమార్, సీనియర్ అసిస్టెంట్ షేక్ నజీరాలు అధికారులకు చిక్కారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories