ప్రేమ పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన యువతి

A Young Woman Was Cheated A Young Man In The Name Of Love
x

ప్రేమ పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన యువతి

Highlights

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘటన

ప్రేమ పేరుతో ఓ యువకుడిని మోసం చేసి 16 లక్షలతో ఉడాయించిన ఓ యువతి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగింది. ఆ కిలాడి లేడిపై బాధితుడు మాదన నాగరాజు, ఆయన తండ్రి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రానికి చెందిన మాదన నాగరాజు.. తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఇషా ఫౌండేషన్ లో చేరాడు. అక్కడ ప్రియాంక అనే యువతితో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం వరకు వెళ్లింది. తిమ్మాపూర్ లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

కొద్ది రోజుల పాటు కాపురం కూడా చేశారు. తనపై నాగరాజుకు పూర్తిగా నమ్మకం కుదిరాక..మోసగించే కుట్రను ఇంప్లీమెంట్ చేసింది ప్రియాంక. పెళ్లి వంకతో బంగారం కొనాలంటూ అతని వద్ద దశల వారిగా 16 లక్షల తీసుకొని మళ్లీ వస్తానంటూ ఆస్ట్రేలియా వెళ్లింది. నెలలు గడుస్తున్నా.. ప్రియురాలు తిరిగి రాకపోవడంతో నాగరాజు ఇటీవల పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. నాగరాజు ఆరోగ్యం మెరుగయ్యాక మళ్ళీ ప్రియురాలు ఫోన్ చేస్తూ మూడు లక్షలు కావాలంటూ, తన పేరిట 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే పెళ్లి చేసుకుంటానంటూ ఫోన్ చేసి వేధిస్తుందని నాగరాజు, అతని తండ్రి స్థానిక ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories