PM Modi: ప్రధాని సభలో యువతి హల్‌చల్‌.. సర్దిచెప్పిన మోదీ

A Young Woman Hulchul in PM Modi Meeting
x

PM Modi: ప్రధాని సభలో యువతి హల్‌చల్‌.. సర్దిచెప్పిన మోదీ

Highlights

PM Modi: ఇలా చేయడం మంచిది కాదు.. అండగా నేనున్నానన్న మోడీ

PM Modi: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా ఓ యువతి హల్‌చల్‌ చేసింది. సభా ప్రాంగణంలో ఉన్న ఫ్లడ్‌లైట్‌ స్తంభం ఎక్కింది. ఇది గమనించిన ప్రధాని మోడీ.. తన ప్రసంగాన్ని ఆపేసి.. ఆ అమ్మాయికి కిందకు దిగాలని కోరారు. ఇలా చేయడం మంచిది కాదని, తమకు అండగా నేనున్నానంటూ చెప్పుకొచ్చారు.

ఇలా చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని, తమ కోసమే తాను ఇక్కడకు వచ్చానని మోడీ చెప్పారు. దయచేసి మందకృష్ణ మాట వినాలని సర్ధిచెప్పారు. దీంతో ఆ యువతి స్తంభంపై నుంచి కిందకు దిగింది. మోడీ ప్రసంగిస్తుండగా యువతి స్తంభం పైకెక్కడంతో సభలో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మోడీ సర్థిచెప్పడంతో ఆ అమ్మాయి కిందకు దిగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మోడీ తన ప్రసంగం కొనసాగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories