కొంపముంచిన ఫేస్‌బుక్‌ పరిచయం.. అమ్మాయి వలలో పొలిటీషియన్

కొంపముంచిన ఫేస్‌బుక్‌ పరిచయం.. అమ్మాయి వలలో పొలిటీషియన్
x
Highlights

ఫేస్‌బుక్‌ పరిచయం కొంపముంచింది. యువతి విసిరిన వలపు వలలో ఓపార్టీకి చెందిన నేత నిండామునిగారు. భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన నాగేందర్‌కు లండన్‌కు చెందిన మిస్సీ జాన్సన్‌ అనే యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఫేస్‌బుక్‌ పరిచయం కొంపముంచింది. యువతి విసిరిన వలపు వలలో ఓపార్టీకి చెందిన నేత నిండామునిగారు. భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన నాగేందర్‌కు లండన్‌కు చెందిన మిస్సీ జాన్సన్‌ అనే యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో యువతి మొదట 68 లక్షల రూపాయల నగదు పంపుతానంటూ నాగేందర్‌ను నమ్మించింది. దీనికి గాను ఢిల్లీకి చెందిన నింబూ అనే మధ్యవర్తి నాగేందర్‌కు ఫోన్‌ చేసి తన పేరిట 68లక్షల రూపాయలు జమయ్యాయని.. కరెన్సీ ఛేంజ్‌కోసం 20లక్షల చెల్లించాలని నమ్మబలికాడు. దీంతో బాధితుడు విడతల వారీగా 20 లక్షలు అకౌంట్లో డిపాజిట్‌ చేశాడు. అయితే తనకు రావాల్సిన నగదు రాకపోవడంతో నాగేందర్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories