Jangaon: వినూత్న రీతిలో ప్రేక్షకులకు శుభాకాంక్షలు

హెచ్ఎంటీవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఓ మహిళ వినూత్న రీతిలో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపింది.

S. Srikanth
Published on: 13 Feb 2020 4:54 PM IST
Jangaon: వినూత్న రీతిలో ప్రేక్షకులకు శుభాకాంక్షలు
X

జనగామ: హెచ్ఎంటీవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఓ మహిళ వినూత్న రీతిలో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపింది. పట్టణానికి చెందిన పెద్ది కుసుమ ముత్యాల ముగ్గు వేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. వాస్తవాలకు నిలువుటద్దంగా నిలుస్తూ, నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ హెచ్ఎంటీవీ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయతకు, వేగానికి మారుపేరుగా వార్తా కథనాలు ప్రసారం చేస్తూ లక్షలాది మంది ప్రజల మన్ననలు పొందుతున్న న్యూస్‌ చానల్‌ హెచ్‌ఎంటీవీ. పదకొండేళ్ల ప్రాస్థానంలో ఎన్నో మైలురాళ‌్లను చేరుకుంటూ.. దూసుకెళ్తోన్న హెచ్ఎంటీవీ సామాన్యుడి గొంతుకను విన్పించడంలో అందరికంటే ముందుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతిబాటకు మార్గ నిర్దేశం చేస్తూ సాగుతోన్న కార్యక్రమాలతో పాటు... ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ‌్లడమే కాదు వాటి పరిష్కారానికి కృషి చేసింది. ప్రజల్లో మమేకమై వారి గొంతును వినిపిస్తోంది హెచ్‌ఎంటీవీ.


S. Srikanth

S. Srikanth

Next Story