2 Headed Snake: భద్రాద్రి జిల్లా గొంపల్లిలో కనిపించిన రెండు తలల పాము

A Two Headed Snake Found In Kompally, Bhadradri District
x

2 Headed Snake: భద్రాద్రి జిల్లా గొంపల్లిలో కనిపించిన రెండు తలల పాము

Highlights

2 Headed Snake: ఇందిరా రిజర్వు ఫారెస్టులో వదిలిపెట్టిన అటవీశాఖ సిబ్బంది

2 Headed Snake: భద్రాద్రి జిల్లా చర్ల మండలం గొంపల్లిలోని గండూరి శ్రీను ఇంట్లో సుమారు 5 కేజీల బరువున్న రెండు తలల పాము కనపడింది. దీంతో అతడు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉపేందర్ ఆదేశాలతో బీట్ ఆఫీసర్ కోర్స శ్రీరాములు చర్ల సెక్షన్ బేస్ క్యాంపు సిబ్బందితో కలిసి... ఆ రెండు తలల పామును ఇందిరా రిజర్వ్ ఫారెస్టులో విడిచిపెట్టారు. రెండు తలల పాముతో సిరి కలిసి వస్తుందని అపోహలున్న నేపథ్యంలో ఆ పాముకు బహిరంగ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కానీ పాముకు ఎటువంటి హాని తలపెట్టకుండా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన గండూరి శ్రీనును గొంపల్లి గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories