Karimnagar: పన్నెండేళ్ల బాలిక మిస్సింగ్.. ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు

A Twelve Year Old Girl Is Missing In Karimnagar District
x

Karimnagar: పన్నెండేళ్ల బాలిక మిస్సింగ్.. ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు

Highlights

Karimnagar: కరీంనగర్‌ శివారులోనే మిస్ అయినట్లు పోలీసుల అనుమానం

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో పన్నెండేళ్ల బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. మానకొండూరు మండలం ఊటూర్‌ గ్రామానికి చెందిన నరసింహ అనే కానిస్టేబుల్‌ కూతురు వశిష్ట అదృశ్యమైంది. క్రిస్టమస్ సెలవులు రావడంతో బాలిక పెద్దపల్లి జిల్లాలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అయితే సెలవులు ముగియడంతో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పెద్దపల్లి బస్టాండ్‌లో ఆమె తాత కరీంనగర్ బస్సు ఎక్కించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అమ్మాయిని ఎక్కించిన బస్సు నెంబర్‌ను బాలిక తండ్రికి మెసేజ్ చేశాడు.

అయితే కూతురి రాక కోసం ఎదురుచూస్తున్నాడు. కరీంనగర్ బస్టాండ్‌కు బస్సు వచ్చినా.. అందులో తమ కూతురు లేకపోవడంతో కండక్టర్‌ను అడిగారు. బాలిక బైపాస్‌రోడ్‌లో దిగినట్లు కండక్టర్ చెప్పడంతో అక్కడికి వెళ్లి గాలించారు. అక్కడ కూడా బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కరీంనగర్ శివారులోనే మిస్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories