Jangaon: జనగామ BRSలో ముదిరిన టికెట్ పోరు

A Ticket Fight In Jangaon BRS
x

Jangaon: జనగామ BRSలో ముదిరిన టికెట్ పోరు

Highlights

Jangaon: ఎమ్మెల్సీ పల్లాకు వ్యతిరేకంగా సమావేశమవుతున్న జనగామ బీఆర్ఎస్ నేతలు

Jangaon: జనగామ బీఆర్ఎస్‌లో టికెట్ పోరు ముదిరింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ వస్తుందంటూ అనుచరులు ప్రచారం చేస్తున్నారు. నిన్న షోడపల్లిలో పల్లా వర్గీయులు రహ‌స్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డికే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేయడంతో.. ముత్తిరెడ్డి వర్గీయులు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మధ్య వివాదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. నర్మెట్ట సర్పంచ్‌ల ఫోరమ్ ముత్తిరెడ్డికి మద్ధతుగా నిలిచారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories