Mancherial: చోరీకి వచ్చి బావిలో పడి దొంగ మృతి

A Thief came to Robbery and fell into well in Mancherial
x

Mancherial: చోరీకి వచ్చి బావిలో పడి దొంగ మృతి

Highlights

Mancherial: బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం

Mancherial: దొంగతనానికి వెళ్లి మంచి నీళ్ళ బావిలో పడి వ్యక్తి చనిపోయిన ఘటన మంచిర్యాలలో వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ చౌరస్తాలో ఉన్న ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం దొంగలు పడ్డారు. అందిన కాడికి సామన్లు దోచుకెళ్తుండగా...గమనించిన స్థానికులు దొంగను పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న దొంగ ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆయనను వదిలిపెట్టారు.

తాజాగా ఇంటి యజమానికి బావిలో ఒక మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలులను చెక్‌ చేశారు. సదరు వ్యక్తి దొంగతనానికి వచ్చి బావిలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని స్థానిక డీసీపీ సుధీర్ కేకన్ పర్యవేక్షించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories