Kamareddy: హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని తల్లి మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య

A Student Committed Suicide After Her Mother Reprimanded Her To Stay In The Hostel And Study
x

Kamareddy: హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని తల్లి మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య

Highlights

Kamareddy: కామారెడ్డిలో ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న శ్రీనిజ

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని తల్లి మందలించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన.. రాజంపేటలో వెలుగుచూసింది. రాజంపేటకు చెందిన భాగ్యలక్ష్మి భర్త గతంలో అనారోగ్యంతో మరణించాడు. దీంతో భాగ్యలక్ష్మి కూతురుతో కలిసి రాజంపేటలో తల్లిదండ్రుల దగ్గర ఉంటూ జీవనం సాగిస్తోంది. శ్రీనిజ స్థానిక KGBV లో 10వ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. అయితే.. హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని తల్లి శ్రీనిజపై ఒత్తిడి తేవడంతో.. మనస్థాపానికి గురైన శ్రీనిజ.. ఇంట్లో ఉరివేసుకొని సూసైడ్‌ చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories