Uttam Kumar: మేడిగడ్డ,అన్నారం కుంగుబాటు పై మంత్రి ఉత్తమ్ ఆరా

A special focus of the Telangana government on the Kaleshwaram project
x

Uttam Kumar: మేడిగడ్డ,అన్నారం కుంగుబాటు పై మంత్రి ఉత్తమ్ ఆరా

Highlights

Uttam Kumar: బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితిపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

Uttam Kumar: కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇవాళ ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన వాడీ వేడి చర్చ జరిగింది. మేడిగడ్డ, అన్నారం కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. మేడిగడ్డ బ్యారేజ్‌‌ను డిజైన్ చేసిన సంస్థ వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజైన్‌కు ప్రభుత్వ అనుమతి లేదని ఉన్నతాధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు.

అక్టోబర్ 21న పిల్లర్లు కుంగితే.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకటి,రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయా? లేక బ్యారేజ్ మొత్తం ప్రమాదంలో ఉందా అని అధికారులను ఉత్తమ్ అడిగారు. బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితిపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories