TS Congress: తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్..రాజీనామా చేసిన కీలక నేతలు..బీజేపీలో చేరే ఛాన్స్!

A Shock To The Congress Party In Telangana
x

TS Congress: తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్..రాజీనామా చేసిన కీలక నేతలు..బీజేపీలో చేరే ఛాన్స్!

Highlights

TS Congress: ఇప్పటికే కాంగ్రెస్ నేతలను హస్తిన తీసుకువెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

TS Congress: ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ తెరలేపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు జరిపేందుకు మాజీ సీఎం కిరణ్ కుమార్‌ రెడ్డి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో మెదక్ మాజీ డీసీసీబీ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా జయపాల్ రెడ్డి తండ్రి బాగారెడ్డి ఉన్నారు. అలాంటి జయపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే పార్టీకి బలం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది. ఇటు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజయ్య, తాండూరు లక్ష్మారెడ్డిలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైయ్యారు. వీరందరినీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే హస్తిన తీసుకువెళ్లారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చే నేతలంతా గత కొంత కాలంగా కిరణ్ కుమార్ రెడ్డితో టచ్‌లో ఉన్నారు. ఆపరేషన్ తెలంగాణలో భాగంగా బీజేపీలోకి చేరికలు పెరిగేలా కిరణ్ కుమార్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు బీజేపీలో చర్చ జరుగుతోంది. వీరంతా అమిత్ షా, నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే ఛాన్స్ ఉంది. మరో వైపు సినీనటి, కాంగ్రెస్ సీనియర్ నేత జయసుధ సైతం బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జయసుధను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు సైతం కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories