నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్

X
Highlights
* యువతి కడుపులోంచి రెండున్నర కేజీల వెంట్రుకలు * ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు * చిన్నప్పటి నుంచి వెంట్రుకలను తింటున్న యువతి
Sandeep Eggoju6 Jan 2021 6:51 AM GMT
నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు.22 ఏళ్ల యువతి కడుపులోంచి రెండున్నర కేజీల వెంట్రుకలను బయటకు తీశారు.కడుపు నొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. యువతిలో కడుపును స్కాన్ చేసిన పరిశీలించిన వైద్యులు వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి, కడుపులోంచి రెండున్నర కేజీల వెంట్రుకలను బయటకు తీశారు. అయితే యువతికి చిన్నప్పటి నుంచి వెంట్రుకలను పీక్కతినే అలవాటుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ వెంట్రుకలు కడుపులోనే ఉండడంతో ఇలా పెద్ద మొత్తంలో వెంట్రుకల ముఠాలా తయారైందని వైద్యులు చెబుతున్నారు.
Web TitleA rare Surgery done in Nirmal district hospital
Next Story