ఆస్తులు పంచుకొని.. అమ్మను 'అనాధ'ను చేసారు

ఆస్తులు పంచుకొని.. అమ్మను అనాధను చేసారు
x
Highlights

ఎలాంటి స్వార్ధం లేని ప్రేమ కేవలం అమ్మానాన్నల దగ్గర మాత్రమే దొరుకుతుందని అంటారు. ఇక అందులో అమ్మ చూపించే ప్రేమకి మనం ఎంత చేసిన తక్కువే అని చెప్పాలి....

ఎలాంటి స్వార్ధం లేని ప్రేమ కేవలం అమ్మానాన్నల దగ్గర మాత్రమే దొరుకుతుందని అంటారు. ఇక అందులో అమ్మ చూపించే ప్రేమకి మనం ఎంత చేసిన తక్కువే అని చెప్పాలి. కానీ ఓ అమ్మను కంటికి రెప్పలాగా చూసుకోకున్నా ఓ మనిషిలాగా చూడకుండా నాలుగు రోజుల నుండి బయటనే ఉంచారు కొడుకులు ... ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండలం ముత్తిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది . ఈ గ్రామానికి చెందినా అనంతుల లక్ష్మమ్మ (80)కు ఆరుగురు సంతానం అందులో ముగ్గురు కుమారులు,కుమార్తెలు...

లక్ష్మమ్మ భర్త పదేళ్ళ కింద చనిపోయాడు. దాని తర్వాత తన 70 ఎకరాల భూమిలో కేవలం ఆరు ఎకరాలు ఉంచుకొని మిగతాది తన పిల్లలకి పంచింది . అ తర్వాత లక్ష్మమ్మని ఒక్కొ కొడుకు ఒక్కో నెల పోషించేలా ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు . కానీ లక్ష్మమ్మ మాత్రం నాలుగు రోజుల నుండి ఓ చెట్టు కిందనే నివాసం ఉంటుంది . దీనిపైన గ్రామస్తులు ప్రశ్నించగా తన రెండో కొడులు ఇంటి నుండి గెంటేసిందిగా చెప్పుకొచ్చింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories