మునుగోడులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు

A Meeting of Congress Leaders today on Munugode By Election
x

మునుగోడులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు

Highlights

*మునుగోడు ఉపఎన్నికపై ఇవాళ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం

Congress: మునుగోడులో గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై.. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం చౌటుప్పల్‌లో మునుగోడు ఉప ఎన్నిక, స్థానిక పరిస్థితులు, వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించనున్నారు. సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితరులు హాజరుకానున్నారు. నిన్న రాత్రి మాణిక్కం ఠాగూర్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. నిన్నటి భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్, షబ్బీర్‌ అలీ, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories