Top
logo

మూడు చెట్లు నరికి ముప్పై తొమ్మిది వేల జరిమానా కట్టాడు ..

మూడు చెట్లు నరికి ముప్పై తొమ్మిది వేల జరిమానా కట్టాడు ..
Highlights

భవన నిర్మాణానికి చెట్లు అడ్డంగా ఉన్నాయని నరికించాడు ఓ యజమాని. దీనితో అతనికి అతనికి అధికారులు రూ 39060లు జరిమానా విధించారు.

భవన నిర్మాణానికి చెట్లు అడ్డంగా ఉన్నాయని నరికించాడు ఓ యజమాని. దీనితో అతనికి అతనికి అధికారులు రూ 39060లు జరిమానా విధించారు. ఈ ఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్‌ లో చోటు చేసుకుంది . బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అయితే భవన నిర్మాణానికి చెట్లు అడ్డంపడుతున్నాయని భవనం యజమాని మూడు చెట్లను అడ్డంగా నరికించేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్ళడంతో దీనిని పరిశీలించిన అధికారులు అతనికి రూ.39060లు జరిమానా విధించారు.. వీటిని అ యజమాని ఈ నెల 9 న చెల్లించాడు .. చెట్ల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా సంగతి తెలిసిందే. అవసరమైతే చెట్లను పెంచాలి కానీ ఇలా చేయకూడదని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించబోమని అధికారులు చెబుతున్నారు .

Next Story