Peddapalli: పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి చెక్‌పోస్టు దగ్గర వ్యక్తి హల్‌చల్‌

Peddapalli: అడ్డుకున్న పోలీసులపై దురుసు ప్రవర్తన నన్నే ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వవాదం

Sandeep Eggoju
Published on: 24 May 2021 3:45 PM IST
A Man Highlight in Peddapalli District Dubbalapalli Police Check Post
X

చెక్ పోస్ట్ వద్ద హల్చల్ చేసిన పెద్దపల్లి ఏమ్మెల్యే సోదరుడు (ఫైల్ ఇమేజ్)

Peddapalli: పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి చెక్‌పోస్టు దగ్గర ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్డుపైకి రావడంతో తన కారును అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆగ్రహానికి గురైన అంజిరెడ్డి.. నా కారును ఆపుతారా అంటూ పోలీసులతో గొడవకు దిగాడు. తాను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తమ్ముడునని, పెళ్లికి వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. పోలీసులు.. ఈ పాస్‌ చూపించాలని కోరగా.. అదేంటో నాకు తెలియదని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అడ్డుకొన్నారు. తానొక రైతునని, వెళ్లనివ్వాలంటూ గొడవకు దిగాడు అంజిరెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story