టెన్త్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను రిటర్న్ చేసిన కోర్టు

A key Development in the Tenth Paper Leak case
x

టెన్త్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను రిటర్న్ చేసిన కోర్టు 

Highlights

Tenth Paper Leak Case: పిటిషన్‌లో పేర్నొన్న ప్రొవిజన్లతో విబేధించిన మెజిస్ట్రేట్

Tenth Paper Leak Case: హన్మకొండ జిల్లాలోని కమలాపూర్‌లో పదో తరగతి పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు చుక్కెదురు అయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను 4వ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న ప్రొవిజన్లతో మెజిస్ట్రేట్ విబేధించింది. దీంతో దీనిపై హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం అశ్రయించనున్నట్లు సమాచారం.

అయితే టెన్త్ హిందీ ప్రశ్నాపత్రాన్ని వాట్సప్‌లో లీక్ చేసిన కేసులో బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో బండి సంజయ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ విచారణకు అసలు సహకరించడం లేదని, బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఇవాళ ఈ పిటిషన్‌ను రిటర్న్ చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories