Swati Maliwal: స్వాతి మలివాల్‌ దాడి కేసులో కీలక పరిణామం

A key development in the Swati Maliwal attack case
x

Swati Maliwal: స్వాతి మలివాల్‌ దాడి కేసులో కీలక పరిణామం

Highlights

Swati Maliwal: దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ ట్యాంపర్ చేశారన్న ఢిల్లీ పోలీసులు

Swati Maliwal: ఆప్ ‌రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలివాల్‌పై దాడి జరిగిన రోజు సీఎం నివాసంలో సీసీ ఫుటేజ్ ట్యాంపర్ చేశారని ఢిల్లీ పోలీసులు వెల్లడించడం సంచలనం రేపుతోంది. కేజ్రీవాల్ నివాసంలో స్వాధీనం చేసుకున్న సీసీటీవీ పుటేజ్ బ్లాంక్‌గా ఉందని, వీడియోను తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ పుటేజ్‌కు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారని చెబుతున్నారు.

మరోవైపు నిన్న ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని వెల్లడించారు. బిభవ్‌ తన ఫోన్‌ పాస్‌వర్డ్‌ కూడా తమకు ఇవ్వడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories