Congress: గాంధీ భవన్‌లో హాట్ హాట్ గా సాగిన కాంగ్రెస్ సమావేశం..

A Heated Congress Meeting At Gandhi Bhavan
x

Congress: గాంధీ భవన్‌లో హాట్ హాట్ గా సాగిన కాంగ్రెస్ సమావేశం..

Highlights

Congress: జులై 30 వ తేదీన కొల్లాపూర్ సభకి హాజరుకానున్న ప్రియాంక గాంధీ

Congress: ఎన్నికల ఎజెండా నే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహలకు పదును పెడుతోంది... భారీగా చేరికలు బహిరంగ సభలు, డిక్లరేషన్ లు, నిత్యం ప్రజల్లో ఉండేలా బస్సు యాత్ర, ఎన్నికల హామీలు పై ఫోకస్ చేసింది.. ఆ దిశగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశం గాంధీ భవన్ లో హాట్ హాట్ గా కొనసాగింది... ఏఐసిసి ఇంచార్జ్ థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశానికి పిఏసి కన్వీనర్ షబ్బీర్ అలీ, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డి తో ముఖ్య నేతలు హాజరయ్యారు.. అయితే మొదటిసారి పిఏసి సమావేశానికి స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి హాజరుకావడం ప్రత్యేకతను సంతరించుకుంది.

పిఏసి సమావేశంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై వ్యూహకర్త సునీల్ కనుగొలు గంటకు పైగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు..రాష్ట్రం కాంగ్రెస్ నేతల గెలుపు, ఓటములు నేతల పనితీరు,100 రోజుల కార్యాచరణ తదితర అంశాల పై వివరించినట్లు సమాచారం.. వీటితో పాటు పార్టీలో ఎవరెవరు చేరాలనుకుంటున్న వారి పేర్లతో కూడిన నివేదికను కనుగొలు పిఏసి ముందు ఉంచారు..టికెట్ల కేటాయింపు లో హైకమాండ్ దే తుది నిర్ణయమని ఎలాంటి లాభియింగ్ లకు అవకాశం లేదని సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు..

జులై 30 వ తేదీన కొల్లాపూర్ సభ కి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని అందులో బిఆరెస్, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు ఉండనున్నాయని ప్రచారక కమిటి చైర్మన్ మధుయాష్కి తెలిపారు..ఆగస్టు 15 వ తేదీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుతన ఎస్సి, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ జరగనుందని తెలిపారు..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సి ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ఎం చేస్తామో తెలపడానికి రెండు రోజుల్లో సబ్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు..

రాష్ట్రం లో బస్సు యాత్ర ఎక్కడి నుండి చేపట్టాలి, ఏ ఏ తేదీల్లో నిర్వహించాలి ఎజెండా ఎలా ఉండాలి అనే దానిపై గతంలో అనుభవం ఉన్నవారితో ఒక కమిటి వేసినట్లు పిఏసి కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు.. ప్రజలకు అవసరమయ్యే 5 డిక్లరేషన్ లపై నిపుణులతో చర్చిస్తామని వెల్లడించారు..

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యుహాలకు పదును పెడుతుండడంతో ఒకవైపు పార్టీ బలోపేతము, చేరికలు, ప్రచారం పై ద్రుష్టి సారిస్తూనే మొదటి విడత టికెట్లను ముందస్తుగా ప్రకటించేందుకు సిద్ధమవుతుండడంతో వీరి వ్యూహాలు ఎంతవరకు వర్క్ అవుట్ అయితాయో చూడాలి మరి...

Show Full Article
Print Article
Next Story
More Stories