Gandhi Bhavan: గాంధీభవన్‌కు టికెట్‌ దరఖాస్తుల వెల్లువ.. 900 దాటిన దరఖాస్తులు

A Flood Of Ticket Application For Gandhi Bhavan
x

Gandhi Bhavan: గాంధీభవన్‌కు టికెట్‌ దరఖాస్తుల వెల్లువ.. 900 దాటిన దరఖాస్తులు

Highlights

Gandhi Bhavan: మధిర నుంచి సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క దరఖాస్తు

Gandhi Bhavan: గాంధీభవన్‌లో ఎమ్మెల్యే టికెట్ల అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. మరో వైపు ఇవాళ చివరి రోజు కావడంతో టికెట్ల కోసం అప్లికేషన్ల సమర్పణకు ‎కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ కు క్యూ కడుతున్నారు. మధిర నుంచి సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు. పీఏతో గాంధీభవన్‌కు దరఖాస్తు పంపించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. ఎల్బీనగర్ నుంచి కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు.

ఓ పక్క ఒక సెగ్మెంట్ కు ఒకే కుటుంబంలోని వ్యక్తులు టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గానికి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక కరీంనగర్ నుంచి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్ రావు దర‎ఖాస్తు చేస్తున్నారు. ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క దరఖాస్తు చేసుకోగా.. పినపాక నుంచి సీతక్క కుమారుడు సూర్యం అప్లికేషన్ సమర్పించారు.

ఇక ప్రత్యక్ష ఎన్నికల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దూరంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈసారి తన కుమారులను ఎన్నికల బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‎ఇందులో భాగంగానే గాంధీ‎భవన్ లో జానారెడ్డి కుమారులు ఎమ్మెల్యే టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ నియోజవకర్గ టికెట్ కోసం చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో జానారెడ్డి పోటీలో లేరనే దానికి కుమారుల దరఖాస్తు బలాన్ని చేకూరుస్తోంది.

ఇప్పట వరకు 9 వందల దరఖాస్తులు దాటినట్లు తెలుస్తోంది. చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య వేయి దాటుతుందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయినప్పటి నుంచి పెద్ద ఎత్తున నేతుల గాంధీ భవన్‌కు వస్తున్నారు. టికెట్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆశావాహులు తమ చివరి ప్రయత్నాలు చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ దరఖాస్తులను పరిశీలించి టికెట్లను కన్ఫామ్ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories