హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం..!

a fire broke out in a flat in janapriya apartments in hyderguda late at night
x

హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం

Highlights

* షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు

Fire Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌ లోని ఓ ఫ్లాట్ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. యం బ్లాక్ నాలుగో అంతస్తులో ఉండే ఆలోక్ కుమార్ కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళాడు. అయితే ఆలోక్ కుమార్ కు చెందిన ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫ్లాట్ యజమాని ఆలోక్ తో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను పూర్తిగా అర్పివేశారు. ఫ్లాట్ లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిళ్లలేదు. అయితే షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories